రవితేజ ఫ్యానిజం మామూలుగా లేదు.. ఏకంగా టైటిల్‌గానే !
రవితేజకు ఎంతో ఇష్టమైన హీరోల్లో మొదటి పేరు అమితాబ్ బచ్చన్‌ది అని తెలిసిందే. ఈ విషయాన్ని రవితేజ కుదిరినప్పుడల్లా చెప్తూ, తన ఫ్యానిజంను చూపిస్తూ ఉంటాడు. కొన్ని సినిమాల్లో ఆయన రిఫరెన్స్‌ని కూడా పెట్టాడు రవితేజ. ఇప్పుడు ఆయన పేరునే టైటిల్‌గా పెట్టుకున్నాడు మాస్ మహారాజా. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఎంటర్టైనర్కు మిస్టర్ బచ్చన్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసేలా ప్లాన్స్ కూడా రెడీ చేసుకున్నారట. హిందీ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా భాగశ్రీ బోర్సే నటించనుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీ శ్రీ ఉంటాడనుకుంటే మిక్కీ జే మేయర్ ను తీసుకుని ఆశ్చర్యపరిచారు.
బడ్జెట్ పరిమితులు మరియు ఎక్కువ టైమ్ లేకపోవడంతో మిక్కీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒరిజినల్ కథను మాత్రమే ఉంచి తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేయనున్నాడట హరీష్. రీసెంట్ గా గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో ఆ డేట్లనే హరీష్ సినిమాకు కేటాయించాడు రవితేజ.
మరోపక్క హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు బ్రేక్ రావడంతో ఖాళీగా ఉన్నాడు. ఎంతలేదన్నా పవన్ రావాలంటే మరో ఆరు నెలలు టైమ్ పడుతుంది. ఈ లోపు ఈ సినిమాను ఫినిష్ చేయాలన్నది హరీష్ ప్లాన్. ఎలాగూ రీమేకే కావడంతో పెద్దగా బయటకు కూడా వెళ్లేపన్లేదు కాబట్టి ఈ సినిమా త్వరగానే పూర్తవుతుంది. ఈ సినిమా ఈగల్ మూవీ రిలీజ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.













