నగ్మాతో వస్తున్న రూమర్లపై రవికిషన్ స్పందన
అల్లు అర్జున్ సూపర్‌హిట్ ఫిల్మ్ రేసు గుర్రంలో విలన్ గా నటించిన రవికిషన్‌కు ఆ సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలు చేశారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రవికిషన్ భోజ్ పూరి భాషలో మంచి స్టార్ హీరో. ఆయన ఖాతాలో చాలానే హిట్ సినిమాలున్నాయి.
అక్కడి మార్కెట్, రెమ్యూనరేషన్లు బాగా తక్కువ కావడంతో తన ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో భాగంగా ఆయన వేరే భాషల్లోనూ తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ భోజ్‌పూరి స్టార్ హీరోకి, హీరోయిన్ నగ్మాకు మధ్య ఏదో సంబంధముందని గత కొంతకాలంగా నార్త్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన నగ్మా, తన సెకండ్ ఇన్నింగ్స్‌ని భోజ్‌పూరిలో స్టార్ట్ చేసింది.
అక్కడ రవికిషన్ తో కలిసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ సమయంలోనే వీరి బంధం గురించి వార్తలొచ్చాయి. ఈ వార్తల విషయంలో నేరుగా రవికిషన్ స్పందించి, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను, నగ్మా మంచి స్నేహితులమే తప్ప తమ మధ్య ఇంకేమీ లేదని ఆయన చెప్పాడు. అంతే కాదు, తన భార్య ప్రీతి శుక్లాను తాను ఎంతగానో గౌరవించడంతో పాటూ ప్రేమిస్తానని, తనకు వేరే ఎవరి మీదా ఎలాంటి దురుద్దేశాలు లేవని రవికిషన్ వెల్లడించాడు.













