రవి బస్రూర్ ఎదుట గట్టి సవాల్
కేజీఎఫ్ సినిమా విజయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతటి కీలక పాత్ర పోషించిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ తో వచ్చే పాటను కూడా చార్ట్ బస్టర్ చేసిన ఘనత రవి బస్రూర్ కు ఉంది. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి అలాంటి స్థాయి మ్యూజిక్ మాత్రం రాలేదు. కేజీఎఫ్ తర్వాత రవి బస్రూర్ చాలా సినిమాలు చేసినప్పటికీ తన నుంచి చెప్పుకోదగ్గ ఆల్బమ్ అయితే రాలేదన్నది నిజం.
దీంతో ఇప్పుడు రవి బస్రూర్ సలార్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా కోసం స్వంత ఊరి రికార్డింగ్ స్టూడియోలో ప్రశాంత్ నీల్ తో కలిసి కుస్తీలు పడుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవి బస్రూర్ చేతిలో ఏడుకి పైగా సినిమాలున్నాయి. గణపథ్, స్వయంభు, భీమా, భైరతి రనగల్, జీబ్రా, మార్టిన్ ఇందులో చెప్పుకోదగ్గవి.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న రవి బస్రూర్ మీద తిప్పి తిప్పి ఒకే మాదిరి బీజీఎం ఇస్తున్నాడనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ కామెంట్స్ అన్నింటికి చెక్ పెట్టాలంటే రవి బస్రూర్ కచ్ఛితంగా ఓ డిఫరెంట్ ఆల్బమ్ ఇవ్వాలి. సలార్ తో అలాంటి కమ్ బ్యాక్ ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరి రవి బస్రూర్ సలార్ తో ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.













