దిల్ రాజు బ్యానర్ నుంచే రవిబాబు ‘ఆవిరి’!
దిల్ రాజు, రవిబాబు కలిసి చేస్తున్న చిత్రం ఆవిరి. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ప్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ పతాకంపై రవిబాబు దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్‌రాజు మాట్లాడుతూ కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు స్పెషలిస్ట్. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఆవిరి ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అక్టోబర్‌లో విడుదల చేస్తాం అని తెలిపారు. రవిబాబు మాట్లాడుతూ దిల్‌రాజుతో కలిసి సినిమా చేయాలని 15 ఏళ్లుగా అనుకుంటున్నా. ఆవిరితో అది కుదిరింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అన్నారు.













