చరణ్ సినిమా కోసం రత్నవేలును దింపిన సుక్కూ
ఇండస్ట్రీలో కొందరికి కొందరితో సింక్ కుదురుతూ ఉంటుంది. ప్రతీ డైరెక్టర్ కు టెక్నికల్ టీమ్ లోని మరికొందరితో ఆ సింక్ ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కసారి వారి పనితనం నచ్చితే ఇక వదులుకోవడానికి ఇష్టపడరు. డైరెక్టర్ సుకుమార్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బాండింగ్ కూడా అలాంటిదే. వీరి బాండింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు.
సుకుమార్ మొదటి సినిమా ఆర్య తో వీరి బంధం మొదలైంది. అప్పటినుంచి సుక్కూ, రత్నవేలుని వదిలిపెట్టింది లేదు. జగడం, 1 నేనొక్కడినే సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ సినిమాటోగ్రఫీ నుంచి ఎటువంటి నెగిటివ్స్ రాలేదు. అంతేకాదు సుకుమార్ నిర్మించిన కుమారి 21ఎఫ్ లాంటి తక్కువ బడ్జెట్ సినిమాకు కూడా సుకుమార్, రత్నవేలునే ఎంచుకున్నాడు. ఆ సినిమాకు నిర్మాతగా సుకుమార్ పెట్టిన ఖర్చు రత్నవేలు కోసం మాత్రమే.
ఇక తర్వాత వారి కాంబోలో వచ్చిన రంగస్థలం ఎన్నో రికార్డులను సృష్టించింది. కానీ సరిలేరు నీకెవ్వరు, సైరా సినిమాల వల్ల రత్నవేలు పుష్ప సినిమాకు పనిచేసే తీరిక దొరకలేదు. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాకు సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు ను టీమ్ ఎంపిక చేసింది. ప్రస్తుతం ఇండియన్2, దేవర సినిమాలకు పని చేస్తున్న రత్నవేలు మే లోపు ఆ రెండు సినిమాలను పూర్తి చేసి ఫ్రీ అవుతాడు కాబట్టి చరణ్ సినిమాకు పూర్తి అందుబాటులో ఉండే అవకాశముంది. ఆర్సి16కు డైరెక్టర్ బుచ్చిబాబే అయినప్పటికీ సుకుమార్ పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందని రత్నవేలుని లైన్ లోకి తీసుకురావడంతో అర్థమవుతోంది.













