రథం పాటను విడుదల చేసిన కీరవాణి
గీత్ ఆనంద్, చాందినీ భగ్యానాని హీరో హీరోయిన్లుగా నటిస్తున చిత్రం రథం. చంద్రశేఖర్ కానూరి దర్శికుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీతం అందిస్తున్నారు. రాజా దారపునేని నిర్మిస్తున్నారు. ఇటీవలే టీజర్‌ను, ఓ పాటను విడుదల చేశారు. మరో పాటని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా రిలీజ్ చేశారు. బిల్ గేట్స్ అనే సాహిత్యంతో మొదలయ్యే ఈ పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత చెప్పారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ ఎ.వినోద్, నిర్మాత రాజా దారపునేని, సంగీతం సుకుమార్ పమ్మి, దర్శకత్వం చంద్రశేఖర్ కానూరి.













