ఈ నెల 26న రథం విడుదల
గీతానంద్, చాందిని భగ్వానని జంటగా నటించిన చిత్రం రథం. చంద్రశేఖర్ కానురి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ చాందిని మాట్లాడుతూ ఆరేళ్ల వయసు నుంచే టీవీ సీరియల్స్, యాడ్స్‌లో నటించాను. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో బాల నటిగా మెప్పించాను. అమితాబ్ చిత్రం ఏక్ రిష్తా, దిల్ బాండ్ ఆఫ్ లవ్, నందితాదాస్ చిత్రం, ఏక్ దిన్ 2 గంటే సినిమాలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక సింపుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో నేను పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో కనిపిస్తాను. డాన్స్ టీచర్‌గా పనిచేసే నాకు హీరోతో పరిచయం ఏర్పడుతుంది. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారంగా సినిమా సాగుతుంది. ఇక తెలుగులో హీరోల్లో నాని, నాగచైతన్య అంటే ఇష్టం. ప్రస్తుతం దిక్సూచి చిత్రంలో నటిస్తున్నాను అని తెలిపారు.













