విజయ్ తో రష్మిక స్పెషల్ సాంగ్?
విజయ్ దేవరకొండ, రష్మిక ఫ్రెండ్షిప్ గీత గోవిందంతో మొదలైంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వారిద్దరి కలయిలో డియర్ కామ్రేడ్ అనే సినిమాను తీశారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అవలేదు. అప్పటినుంచి వారి కాంబోలో మళ్లీ ఇప్పటివరకు సినిమా వచ్చింది లేదు. కానీ వీరిద్దరూ మాత్రం ఎప్పుడూ కలిసే కనిపిస్తున్నారు
విజయ్ ఎక్కడుంటే రష్మిక అక్కడ అన్నట్లు వారిద్దరి మధ్య సఖ్యత కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి టూర్లు వెళ్లడం, పండగలు కలిసి చేసుకోవడం ఇలా చాలానా ఉన్నాయి. కానీ మీడియా అటెన్షన్ వాళ్ల మీదకు మళ్లినప్పుడు మాత్రం మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ నెట్టుకొస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబోని మళ్లీ తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతో ఆరాట పడుతున్నారు.
కానీ ఆ అవకాశాలు మాత్రం వారికి రావడం లేదు. పరశురామ్ తో విజయ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ లో రష్మిక నటించనుందని ఆ మధ్య వార్తలొచ్చాయి కానీ అందులో ఏ మాత్రం నిజం లేదన్నది తెలుస్తోంది. కానీ ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్, గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సినిమాలో మాత్రం రష్మిక తో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా రష్మిక మెరవనుందని తెలుస్తోంది.













