Rashmika Mandanna: నోరు జారిన రష్మిక
కన్నడ భామ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఎక్కడున్నా చాలా యాక్టివ్ గా ఉంటుంది. చాలా హైపర్ గా మాట్లాడుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా, ఇంటర్వ్యూలో అయినా ఏదైనా సరే రష్మిక మాటతీరు అంతే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఓ ప్రశ్నకు సమాధానంగా తనకు బాగా ఇష్టమైన సినిమా గిల్లీ అని చెప్తూ పనిలో పనిగా అది పోకిరి(Pokiri)కి రీమేక్ అనే విషయం చాలా లేటుగా తెలుసుకున్నట్లు చెప్పింది.
అయితే రష్మిక చెప్పిందంతా బానే ఉంది కానీ గిల్లీ ఒరిజినల్ రీమేక్ పోకిరి కాదు ఒక్కడు(Okkadu). దీంతో రష్మిక మాట్లాడిన ఆ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయిపోయింది. విజయ్ సినిమా అంటే ఎంత ఇష్టమున్నా తెలుగు హీరో మహేష్ బాబు(Mahesh Babu) ఒక్కడు, పోకిరి లాంటి హిట్స్ గురించి తెలియదన్నట్టు మాట్లాడటం ఏంటని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అమ్మడిపై ఫైర్ అయ్యారు.
ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన రష్మిక సారీ చెప్తూ తనకు వాళ్ల మూవీస్ అన్నీ ఇష్టమేనని, ఏదో ఫ్లోలో తప్పుగా చెప్పినట్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయ్యారు. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు రష్మిక దానికి రియాక్ట్ అయ్యే తీరు ఇప్పుడు అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. పుష్ప2(Pushpa2)తో బ్లాక్ బస్టర్ ను అందుకుని సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక వచ్చే నెలలో విక్కీ కౌశల్(Vicky Kaushal) చావా(Chaawa)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.













