Rashmika Mandanna: అందరితో దయగా ఉండమంటున్న రష్మిక

లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పటివరకు మనం ఉంటామో తెలియదని, అందుకే ప్రతీ ఒక్కరితో దయగా ఉండమంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna). వరుస సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్న రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గురించి అప్డేట్స్ ను అందిస్తూ యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే రష్మిక తాజాగా ఓ పోస్ట్ చేసింది. అయితే ఈ సారి రష్మిక చేసిన పోస్టులో తను షేర్ చేసిన ఫోటోల కంటే మ్యాటరే హైలైట్ గా నిలిచింది. అందరితో కలిసి ఉండటం తనకెంతో ఆనందాన్నిస్తుందని, టైమ్ చాలా పెళుసుగా ఉందని, టైమ్ తో మనం కూడా చాలా పెళుసుగా ఉన్నామని, భవిష్యత్తును ఎవరూ ఊహించలేమని, కాబట్టి దయచేసి ఒకరిపై ఒకరు దయగా ఉంటూ, మీ పట్ల మీరు దయగా ఉంటూనే, లైఫ్ లో ఇంపార్టెంట్ అనుకున్న పనుల్ని వెంటనే చేయమని రష్మిక రాసుకొచ్చింది.
రష్మిక చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే రష్మిక ఇలా దయగా ఉండమని చెప్పడం ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు, ఫిబ్రవరిలో కూడా రష్మిక తన ఇన్‌స్టాలో ఇదే విషయం గురించి మాట్లాడింది. ప్రస్తుత రోజుల్లో దయ అనేది కరువైందని, నేను అందరినీ ఒకేలా చూస్తాను. మీరు కూడా అలానే ఉంటూ ఒకరిపై ఒకరు దయతో ఉండమని పోస్ట్ చేయగా, ఇప్పుడు మరోసారి రష్మిక అదే పోస్ట్ చేయడం విశేషం. ధనుష్(dhanush) సరసన రష్మిక నటించిన కుబేర(kubera) సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.instagram.com/p/DLC1hQJILLP/?utm_source=ig_web_copy_link&igsh=MW5wcDBpZWIzejhteg==