విదేశాల్లో రష్మికతో సల్మాన్ రొమాన్స్
సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సికిందర్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తైంది. ఈ నేపథ్యంలోనే సికిందర్ నెక్ట్స్ షెడ్యూల్ను యూరప్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా కొంత టాకీ పార్ట్ తో పాటు రెండు పాటల షూటింగ్ కూడా ప్లాన్ చేశారట.
అందులో ఓ పాట రొమాంటిక్ సాంగ్ అని సమాచారం. సల్మాన్- రష్మిక మధ్య వచ్చే ఈ సాంగ్ లో ఇద్దరి మధ్య ఘాటైన రొమాన్స్ ఉంటుందని, ప్రీతమ్ ఈ పాటను అద్భుతమైన రొమాంటిక్ పాటగా కంపోజ్ చేసి పెట్టాడని, యూరప్ లొకేషన్స్ లో షూట్ చేస్తే ఈ సాంగ్ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని భావిస్తున్నాట.
ఇక రెండో సాంగ్ మాత్రం పబ్ లో ఉంటుందని టాక్. ఇప్పటికే డైరెక్టర్ మురుగదాస్ యూరప్ వెళ్లి సాంగ్ లొకేషన్స్ కోసం వెతుకుతున్నాడని, లొకేషన్స్ ఓకే అయ్యాక సల్మాన్, రష్మిక కూడా యూరప్ వెళ్తారని చిత్ర వర్గాలంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈద్ కు ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.













