రేర్ ఫీట్ సాధించిన రష్మిక
హీరోయిన్లకు పెద్ద పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ దొరకడమే అదృష్టమయితే అలాంటిది ఒకేసారి రెండు క్రేజీ ఆఫర్లు అందుకుని ఆ రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేసే ఛాన్స్ దొరకడం మాత్రం చాలా రేర్. రష్మిక మందన్న ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలు. డిసెంబర్ 6న రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప2 రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
ఓ వైపు షూటింగ్ పూర్తి చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ ను వేగవంతం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ కాకూడదని సుకుమార్ రాత్రింబవళ్లు వర్క్ చేస్తున్నాడు. మరోవైపు అదే రోజున రష్మిక నటించిన మరో ప్రిస్టీజియస్ మూవీ చావా రిలీజ్ కానుంది. ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రష్మికకు నటన పరంగా చాలా పెద్ద ఛాన్స్ అని చెప్తున్నారు.
యానిమల్ సినిమా తర్వాత రష్మికకు బాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరిగింది. దానికంటే ముందే రష్మిక గుడ్‌బై, మజ్ను లాంటి సినిమాలు చేసినా అవేవీ రష్మికకు తగిన సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. మొత్తానికి ఒకేరోజు రెండు సినిమాలతో రష్మిక ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పుడు అగ్ర హీరోలతో పాటూ విజయశాంతి లాంటి సీనియర్ హీరోయిన్లు నటించిన సినిమాలు ఒకే రోజు రెండు రిలీజ్ లు అయ్యాయి. కానీ తర్వాత ఎవరూ ఆ ఫీట్ సాధించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు రష్మిక ఈ ఘనతను అందుకుంటుంది.













