మరో స్టార్ బ్యూటీ కోసం బుచ్చిబాబు ప్రయత్నాలు
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ ను పూర్తి చేసే పనిలో ఉన్న రామ్ చరణ్ ఆ తర్వాతి సినిమాను బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కుతుంది. మొదటి సినిమా ఉప్పెన తోనే మంచి హిట్ అందుకున్న బుచ్చిబాబు, ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
అందుకు తగ్గట్టే క్యాస్టింగ్ తోనే బుచ్చిబాబు ఈ సినిమాపై క్రేజ్ ను పెంచుతున్నాడు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను రంగంలోకి దింపిన బుచ్చిబాబు, మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ ను ఎంచుకుని అమాంతం అంచనాలను పెంచేశాడు. చాలా కాలం తర్వాత రెహమాన్ ఒక తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు సాంగ్స్ ను ట్యూన్ చేశాడు కూడా.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరికొన్ని క్యారెక్టర్లు కూడా స్పెషల్ గా ఉండనున్నాయట. ప్రముఖ నటీనటులను కీలక పాత్రల కోసం బుచ్చిబాబు ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి పేరు గట్టిగా వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నాడని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. వీళ్లు కాకుండా మరో స్టార్ బ్యూటీని ఈ సినిమా కోసం రంగంలోకి దింపేందుకు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట. అది మరెవరో కాదు రష్మిక మందన్నా. ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం రష్మిక ను తీసుకోవాలని బుచ్చిబాబు ట్రై చేస్తున్నాడట. సెకండాఫ్ లో వచ్చే ఆ సాంగ్ చాలా స్పెషల్ అని, అందుకే స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మేకర్స్ ఒకసార రష్మిక ను సంప్రదించినట్లు సమాచారం.













