మరో బాలీవుడ్ ఆఫర్ పట్టేసిన రష్మిక
టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక సరిగ్గా నెంబర్ వన్ పొజిషన్ కు వెళ్లే టైమ్ కు ఒక్క టాలీవుడ్ లోనే కాదు, మిగిలిన భాషల్లో కూడా తనదైన ముద్ర వేసుకుని గుర్తింపు తెచ్చుకోవాలని భావించింది. అందులో భాగంగానే బాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకోవాలని చూస్తుంది.
దాని కోసమే రణ్బీర్ కపూర్ తో యానిమల్ మూవీలో హాట్ రొమాన్స్ కు సైతం ఓకే చెప్పింది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్లో బోలెడ్ లిప్ లాక్స్ ఉండగా, సినిమాలో ఇంకా చాలా ఉన్నాయని, వయొలెన్స్, లవ్ రెండూ మిక్స్ చేసిన ఫస్ట్ నైట్ సీన్ డైరెక్టర్ సందీప్ నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కించాడని ఇన్సైడ్ టాక్. అయితే రష్మిక ఇప్పుడు ఓ మీడియం రేంజ్ హీరోతో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
కెరీర్లో మంచి హిట్స్ ఉన్నప్పటికీ టాప్ లీగ్ లోకి చేరని విక్కీ కౌశల్ తో రష్మిక జోడీ కట్టనుంది. విక్కీ కౌశల్ తాజాగా ఓ పీరియాడిక్ డ్రామాను చేయబోతున్నాడు. చావా ది గ్రేట్ వారియర్ లో టైటిల్ రోల్ చేయబోతున్నాడు. జయసింగ్ రావు అనే నావలిస్ట్ రాసిన కథ ఆధారంగా రాహుల్ జనార్ధన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అక్టోబర్ 16 నుంచి షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. రూ. 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా రష్మిక కు మొదటి పీరియాడిక్ ఫిల్మ్ కానుంది. యానిమల్ హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్న రష్మిక, ఈ సినిమా తర్వాత వచ్చే ప్రతి ఆఫర్ ను వదులుకోకూడదని డిసైడైందట. అందుకే తన కాల్షీట్స్ ను బిజీ చేసుకునే పనిలో రష్మిక బిజీగా ఉంది.













