Rashmika: రష్మిక నుంచి రెండు కూల్ క్యారెక్టర్లు
పుష్ప(Pushpa) సినిమా తర్వాత నుంచి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) రేంజే మారిపోయింది. ఆ తర్వాత యానిమల్(Animal) సినిమాలో నటించి బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక పుష్ప2(Pushpa2) లో కూడా బోల్డ్ క్యారెక్టర్లోనే కనిపించింది. ఇంటిమేట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ కు నో చెప్పకుండా చేస్తున్న రష్మిక సల్మాన్ ఖాన్(Salman Khan) తో సికిందర్(Sikinder) సినిమాలో కూడా అలాంటి సీన్స్ లో కనిపించనుందంటున్నారు.
అయితే సికిందర్ రావడానికి కాస్త టైముంది. ఈ లోపు రష్మిక నుంచి మరో రెండు కూల్ క్యారెక్టర్లు రానున్నాయి. అందులో మొదటిది ధనుష్(Dhanush) హీరోగా శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో వస్తున్న కుబేర(Kubera) కాగా రెండోది రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గర్ల్ ఫ్రెండ్(Girl Friend) సినిమా. ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక సాఫ్ట్ రోల్ లోనే కనిపించే అవకాశముంది.
ఎందుకంటే శేఖర్ కమ్ముల ఇప్పటివరకు తన సినిమాల్లోని హీరోయిన్లను కూల్ పాత్రల్లోనే చూపించాడు తప్పించి గ్లామర్ అనే దానికి చోటివ్వడు. గ్యాంగ్ స్టర్ డ్రామా అయినప్పటికీ హీరోయిన్ క్యారెక్టర్ ను గ్లామరస్ గా చూపించడు. ఇక గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మికనే టైటిల్ రోల్ చేస్తుంది కాబట్టి ఆ పాత్రను వీలైనంత హుందాగా చూపించాలి. ఈ రెండు సినిమాలై నెక్ట్స్ ఇయర్ లోనే రానున్నాయి.













