Rashmika Mandanna: శాఖాహారిగా మారిన నేషనల్ క్రష్

కన్నడ సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక(rashmika) తర్వాత ఛలో(chalo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తక్కువ టైమ్ లోనే తెలుగులోని స్టార్ హీరోలందరితో నటించి ఎంతో క్రేజ్ ను తెచ్చుకున్న రష్మిక.. పుష్ప(pushpa), పుష్ప2(pushpa2), యానిమల్(animal), ఛావా(Chhava) సినిమాలతో దేశవ్యాప్తంగా తన ఫాలోయింగ్ ను పెంచుకోవడమే కాకుండా విపరీతమైన స్టార్‌డమ్ ను అందుకుంది.
ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్లకే నేషనల్ క్రష్(national crush) అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న రష్మిక రీసెంట్ గా తన లైఫ్‌స్టైల్ లో వచ్చిన ఓ పెద్ద మార్పును వెల్లడించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. మాంసం తీసుకోవడాన్ని తాను పూర్తిగా మానేసి, ఫుల్ వెజిటేరియన్ గా మారానని రష్మిక చెప్పడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలోని వారిని కూడా ఆశ్చర్యపరిచింది.
డైటీషియన్ చెప్పినట్టు ప్రతీ రోజూ తాను ఓ లీటర్ నీటితో పాటూ ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుంటానని, ఆ తర్వాత భారీ భోజనాలు, అన్నం తినడం, రాత్రిపూట ఎక్కువ తినడం లాంటివి మానేశానని, వాటితో పాటూ టమోటా, బంగాళాదుంప, దోసకాయ లాంటి రెగ్యులర్ కూరగాయాలను అలర్జీ వల్ల మానేశానని రష్మిక చెప్పింది. కేవలం డైట్ మాత్రమే కాకుండా యాక్టివ్ గా ఉండటానికి ప్రతీ రోజూ వర్కవుట్స్ చేస్తానని రష్మిక చెప్పడంతో అందరూ ఆమె ఇంత హెల్తీ లైఫ్ స్టైల్ మెయిన్‌టెయిన్ చేస్తుందా అని భావిస్తున్నారు.