బన్నీతో రష్మిక రొమాన్స్!
గత ఏడాది గీతగోవిందం సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న రష్మిక మండన్న తాజాగా మరో లక్కీఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఆమె అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అన్వేషణ జరుగుతోంది. అందులో ముఖ్యంగా రష్మిక మండన్న పేరు పరిశీలించారని, ఇప్పటికే ఆ దిశగా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇదివరకే మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టిన రష్మిక, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. మొత్తానికి అల్లు అర్జున్‌తో జోడీ కట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్లో నటిస్తోంది.













