హిట్స్ లేని ఆ యంగ్ హీరోతో రష్మిక నటించేందుకు ఓకే చెబుతుందా?
అఖిల్ చిత్రంతో తన కెరీర్ స్టార్ట్ చేసిన అఖిల్ అక్కినేని ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. అఖిల్, మిస్టర్ మజ్ను, హలో.. ఈ మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భాస్కర్‌కి కూడా ఈమధ్యకాలంలో సరైన హిట్ లేదు. ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఇద్దరికీ కీలకమే అని చెప్పాలి. ఈ సినిమా విడుదల కాకముందే అఖిల్ మరో సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను రూపొందించి ఇటీవల సైరా వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో అఖిల్ సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య ప్రకటించారు. సురేందర్‌రెడ్డి కెరీర్లో హిట్ పర్సంటేజ్ ఎక్కువే. అతను సెలెక్ట్ చేసుకునే కథాంశాలు కూడా భిన్నంగానే ఉంటాయి. కాబట్టి సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో అఖిల్ చేసే సినిమా అతని కెరీర్‌కి బాగానే ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తే బాగుంటుందన్న డిస్కషన్ జోరుగా జరుగుతోందట. ఫైనల్‌గా రష్మిక మందన్న అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. ఇప్పటికే వరస విజయాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మికను హీరోయిన్గా తీసుకోవాలంటే భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే వరస హిట్స్‌తో ముందుకెళ్తున్న రష్మిక ఇప్పటివరకు పెద్ద హీరోలతోనే సినిమాలు చేసింది. మరి అఖిల్ సరసన నటించేందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది ప్రశ్న. తాను స్టార్ హీరోల సరసనే నటిస్తానని ఆమధ్య రష్మిక ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల్ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ప్రశ్న. ఆమె ఓకే చెబితే ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.













