Rashmika Mandanna: సల్మాన్ భాయ్‌ను రష్మిక ఆదుకుంటుందా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఎక్కడ కాలుపెడితే అక్కడ లక్ కలిసొస్తుంది. ఛలో(Chalo) సినిమాతో నాగ శౌర్య(Naga Shaurya)కు, గీత గోవిందం(Geetha Govindam)తో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు లక్ అందించిన రష్మిక ఆ తర్వాత కూడా గోల్డెన్ లెగ్ అనే కీర్తిని అందుకుంది. పుష్ప సినిమాతో తన సత్తాను నేషనల్ లెవెల్ లో చాటిన రష్మికకు ఆ సినిమా తర్వాత అసలు ఎదురులేకుండా పోయింది.
బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మొదట్లో ఫ్లాపులు అందుకున్నప్పటికీ అక్కడ తన హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రష్మిక సినిమాలో ఉందంటే చాలు ఆ సినిమా హిట్టేనని అందరూ ఎంతో బలంగా నమ్ముతున్నారు. రష్మిక గోల్డెన్ లెగ్ రీసెంట్ గా వచ్చిన చాలా సినిమాలకు వర్కవుటైంది. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) కి యానిమల్(Animal) సినిమాతో హిట్ దక్కడాన్ని కూడా రష్మిక సెంటిమెంట్‌గా చెప్తున్నారు ఆమె ఫ్యాన్స్.
దీంతో ఇప్పుడు సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్న సికిందర్(Sikindar) సినిమాను కూడా రష్మికనే ఆదుకోవాలని అందరూ అంటున్నారు. సికిందర్ సినిమాకు రష్మిక నటన, క్రేజ్ చాలా పెద్ద అస్సెట్ కానున్నాయని అమ్మడి ఫ్యాన్స్ భావిస్తున్నారు. తన గోల్డెన్ లెగ్ తో సల్మాన్ ను కూడా ఫ్లాపుల నుంచి శాపగ్రస్థుడిని చేయాలని అందరూ కోరుకుంటున్నారు. మురుగదాస్(Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికిందర్ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.













