రష్మికకు మరో అరుదైన ఘనత
తెలుగుతో పాటు, హిందీలోనూ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న కథానాయిక రష్మిక మరో అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో యువ వ్యాపార వేత్తలు, ఆవిష్కరణ కర్తలు, క్రీడాకారులు, సంగీతం, సమాజసేవ, ఇంధనం, ఆర్థిక, మీడియా, న్యాయ, వినోదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్ ఇలా పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది.













