Rashmika Mandanna: ఆ సాంగ్ డ్యాన్స్ మొదట్లో కాస్త అసౌకర్యంగా అనిపించింది: రష్మిక
రీసెంట్ గా వచ్చిన పుష్ప2(Pushpa2) సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) కు జోడీగా నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna). సినిమాలో ప్రతీ సీన్ లో తన టాలెంట్ ఏంటో చూపించిన రష్మిక, సాంగ్స్ లో కూడా మంచి గ్రేస్ తో స్టెప్పులేసింది. ముఖ్యంగా పీలింగ్స్ సాంగ్ (Peelings Song)లో రష్మిక వేసిన స్టెప్పులు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.
తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో పీలింగ్స్ సాంగ్ పై మాట్లాడింది. సినిమా రిలీజ్ కు కొన్నాళ్ల ముందే ఆ సాంగ్ షూట్ చేశామని, మొత్తం సాంగ్ పూర్తి కావడానికి 5 రోజులు పట్టిందని, అల్లు అర్జున్ గారితో కలిసి డ్యాన్స్ చేస్తున్నందుకు తానెంతో మురిసిపోయానని, కానీ మొదట్లో మాత్రం కాస్త అసౌకర్యంగా, భయంగా అనిపించిందని రష్మిక వెల్లడించింది.
అంతేకాదు తనను ఎవరైనా ఎత్తుకుంటే తనకు భయమేస్తుందని, సాంగ్ లో తనను ఎత్తుకున్నప్పుడు కూడా చాలా భయపడినట్టు తెలిపింది రష్మిక. తర్వాత నార్మల్ గానే అనిపించిందని, ఆ సాంగ్ షూటింగ్ మొత్తం చాలా ఫన్ తో జరిగిందని, కాకపోతే సాంగ్ అందరికీ నచ్చకపోవచ్చని ఎవరిష్టం వారిదని ఆమె అభిప్రాయపడింది. తాను ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికే ఉన్నానని రష్మిక తెలిపింది.













