Rashmika Mandanna: విమర్శలకు చెక్ పెట్టనున్న రష్మిక

కిరిక్ పార్టీ(Kirrik party)తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా(rashmika mandanna) ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే పలు సినిమాలు చేసి తనకంటూ భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు హిట్ సినిమాలు చేసి తన సత్తా చాటిన రష్మిక మందన్నా ఇప్పడు లీడ్ రోల్ లో ఓ క్యారెక్టర్ చేస్తోంది. అదే మైసా. రీసెంట్ గానే మైసా(Mysaa)కు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా, ఆ పోస్టర్ కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఈ పోస్టర్ ఓ రష్మికను చూసి అందరూ షాకయ్యారు. పోస్టర్ లో రష్మిక లుక్ చాలా ఇంటెన్స్ గా ఉండటమే కాకుండా చాలా హుందాగా కనిపించింది. ఈ లుక్ చూశాక రష్మికను చంద్రముఖి(chandramukhi), అరుంధతి(Arundhathi)లోని జ్యోతిక(Jyothika), అనుష్క(Anushka) లాంటి హీరోయిన్లతో పోలుస్తున్నారు. రవీంద్ర పుల్లే(Ravindra Pulle) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో రష్మిక నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తోందట.
రష్మికకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ, ఆమె ఎంత మంచి స్క్రిప్ట్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నప్పటికీ పలు సినిమాల్లో ఆమె యాక్టింగ్ కు తగ్గ ప్రశంసలు అయితే అందుకోలేదు. దానికి తోడు రష్మిక ఇప్పటివరకు కేవలం తన యాక్టింగ్ తో సినిమాను నిలబెట్టిన దాఖలాలు లేవు. రష్మికకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కావాల్సింది క్రేజ్ కాదు, మంచి కథ, దాన్ని ప్రెజెంట్ చేసే విధానం. ఇప్పుడు మైసాతో తనపై వచ్చిన విమర్శలన్నింటికీ రష్మిక తన యాక్టింగ్ తో బదులివ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మైసా రష్మిక కెరీర్లో మైల్ స్టోన్ గా మిగలడం ఖాయం.