Rashmika: టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఓ వైపు వరుస సక్సెస్ లతో నెక్ట్స్ లెవెల్ రేంజ్ లో దూసుకెళ్తుంది. రష్మిక సినిమా వస్తుందంటే చాలు యూత్ అంతా ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. రీసెంట్ గా పుష్ప2(Pushpa2)తో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలున్నాయి. మూడు నాలుగు సినిమాలు లైన్ లో కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే రష్మిక పర్సనల్ లైఫ్ గురించి మీడియా స్పెషల్ అటెన్షన్ చూపిస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరోతో రష్మిక రిలేషన్ లో ఉందని ఎప్పట్నుంచో టాక్ నడుస్తుంది. వారెక్కడా ఈ విషయాన్ని ఓపెన్ అయి చెప్పింది లేదు కానీ వారితో పని చేస్తున్న వాళ్లంతా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) రష్మిక పెళ్లిపై కామెంట్ చేశాడు.
డాకు మహారాజ్(Daku Maharaj) ప్రమోషన్స్ లో భాగంగా అన్స్టాపబుల్ షోకు వచ్చిన నాగవంశీ రష్మిక ప్రస్తావన తీసుకొచ్చాడు. టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం తెలియదని, తెలిసినా అతను చెప్పడం కుదరదని చెప్పుకొచ్చాడు. రష్మిక గురించి ఆమెతో పని చేసే నిర్మాత ఇలా డైరెక్ట్ గా పెళ్లి గురించి చెప్పడం చూస్తుంటే ఏదొకరోజు రష్మిక ఎంగేజ్మెంట్ వార్త సడెన్ గా విన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.













