Mysaa: నెవర్ బిఫోర్ అవతార్ లో నేషనల్ క్రష్

కిరిక్ పార్టీ(Kirrik party) సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఛలో(Chalo) అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితోనూ జత కట్టిన రష్మిక స్టార్ హీరోయిన్ నుంచి ఇప్పుడు నేషనల్ క్రష్ గా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ తన కెరీర్ ను మంచి జోష్ లో ముందుకు తీసుకెళ్తుంది.
రష్మిక అన్ని భాషల్లో సినిమాలు చేయడమే కాకుండా ఆ సినిమాలన్నింటితో సక్సెస్ లు అందుకుంటూ పాన్ ఇండియా సినిమాలకు లక్కీ ఛార్మ్ గా మారింది. ఇప్పటికే యానిమల్(Animal), పుష్ప2(Pushpa2), ఛావా(Chhava) సినిమా సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక రీసెంట్ గా కుబేర(Kubera) సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంది. ఇదిలా ఉంటే రష్మిక నుంచి ఇప్పుడో క్రేజీ సినిమా రాబోతుంది.
రష్మిక ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తుండగా, దానికి సంబంధించిన టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రష్మిక నెవర్ బిఫోర్ లుక్ లో ఎవరూ ఊహించని మాస్ అవతార్ లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. రవీంద్ర పుల్లే(ravindra pulle) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు మేకర్స్ మైసా(Mysaa) అనే పవర్‌ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేయగా ఫస్ట్ లుక్ తోనే అందరికీ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అన్‌ఫార్ములా ఫిల్మ్స్(Unformulae Films) ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.