Rashmika Mandanna: రెమ్యూనరేషన్ పెంచేసిన నేషనల్ క్రష్
కిరిక్ పార్టీ(kirrik party) మూవీతో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక(rashmika), ఛలో(Chalo) మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన రష్మిక, పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని నేషనల్ క్రష్ గా మారిపోయింది. పుష్ప తర్వాత అమ్మడికి అవకాశాలు పాన్ ఇండియా లెవెల్ లో తలుపు తట్టాయి.
అందులో భాగంగానే తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా రష్మిక సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే గత కొన్నాళ్లుగా రష్మిక చేసిన సినిమాలన్నీపాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అవుతుండటంతో ఆమె లక్కీ హీరోయిన్ గా మారింది. యానిమల్(Animal), పుష్ప2(Pushpa2), ఛావా(Chhava) సినిమాల తర్వాత రష్మిక క్రేజ్, డిమాండ్ మరింత పెరిగింది.
ఇప్పుడా క్రేజ్ ను రష్మిక క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. అందుకే తాను 2026లో చేయబోయే ప్రాజెక్టులకు రష్మిక భారీగా డిమాండ్ చేస్తుందని అంటున్నారు. రష్మిక ఒక్కో సినిమాకు ఏకంగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుండగా, నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే అంటారు దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని.






