Rashmika Mandanna: స్టైలిష్ లుక్ లో నేషనల్ క్రష్
ఛలో(Chalo) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన ఛాన్సులందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది. నేషనల్ క్రష్ గా ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న రష్మిక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే తన రెగ్యులర్ ఫోటోలను షేర్ చేసే రష్మిక తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ట్రెండీ లుక్ లో అవతారమిచ్చింది. వైట్ షర్ట్, బ్లాక్ కోట్ ధరించి గం బూట్స్ వేసుకుని చాలా కొత్తగా కనిపించి తన లుక్స్ తోనే అందరినీ ఆకట్టుకుంది. నెటిజన్లు ఈ ఫోటోలను ప్రస్తుతం నెట్టింట వైరల్ చేస్తున్నారు.






