Rashmika Mandanna: మీ ఎంపికలే మిమ్మల్ని స్టార్ గా నిలబెడతాయి: రష్మిక
కిర్రిక్ పార్టీ(Kirrik Party)తో కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక(Rashmika) తర్వాత ఛలో(Chalo) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఛలో తర్వాత రష్మిక తెలుగులో సెటిలైపోయింది. పుష్ప(Pushpa), యానిమల్(Animal), పుష్ప2(Pushpa2), ఛావా(Chhava) సినిమాలతో ఇండియన్ మూవీకి క్వీన్ గా సత్తా చాటుతోన్న రష్మిక ప్రస్తుతం సల్మాన్ ఖాన్(Salman Khan) తో కలిసి సికిందర్(Sikindar) మూవీ చేసింది.
రంజాన్ సందర్భంగా సికిందర్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సికిందర్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న రష్మిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కొత్త సవాళ్లను తానెప్పుడూ యాక్సెప్ట్ చేస్తానని చెప్తోన్న రష్మిక, సౌత్ లో ఉన్న పోటీ గురించి కూడా మాట్లాడింది. మీ ఎంపికలే మిమ్మల్ని నటుడి నుంచి స్టార్ గా మారుస్తాయని ఓ బుక్ లో చదివానని రష్మిక ఈ సందర్భంగా చెప్పింది.
ఇప్పటివరకు తాను చేసిన ప్రతీ మూవీ తన సొంత నిర్ణయమే అని, తనకెప్పుడూ ఎవరూ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదని, తన లైఫ్ తనదే అని, తాను తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే రిజల్ట్ ఏదైనా సరే దానికి పూర్తి బాధ్యత కూడా తనదేనని, ఏ రంగంలోనైనా పోటీ ఉంటుందని, వాటిని పట్టించుకోకుండా మన పని చేసుకుంటూ వెళ్తే చాలని రష్మిక తన అభిప్రాయాన్ని చెప్పింది.













