రష్మికకు సపోర్ట్‌గా వేలాది మంది
గత రెండు రోజుల నుంచి ఓ ఫేక్ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రష్మిక మందన్నాకు ఆపాదించి ఎవరో గుర్తు తెలియని వాళ్లు నెట్టింట వైరల్ చేశారు. ఈ వీడియో గురించి భాషతో సంబంధం లేకుండా పలువురు స్పందిస్తున్నారు. ఇలాంటివి మళ్లీ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ పిలుపునివ్వడంతో ఈ వివాదం చాలా దూరమెళ్లింది.
బిగ్ బీ తర్వాత చాలా మంది కూడా ఈ వివాదంలో స్పందించారు. అయితే ఇక్కడ అన్యాయం జరిగింది సదరు ఫిల్మ్ స్టార్ కు కాబట్టి అందరూ స్పందిస్తున్నారు. అలా కాకుండా ఓ మధ్య తరగతి అమ్మాయికి ఇలా జరిగిఉంటే పరిస్థితేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇలాంటి వీడియోలు ఎవరు క్రియేట్ చేస్తున్నారో త్వరగా పసిగట్టాలని అందరూ కోరుతున్నారు.
రష్మికకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ బిగ్ బీ అమితాబ్ తో పాటూ ఆయుష్ జైన్, అనురాగ్ మీనా, చిన్మయి శ్రీపాద, ప్రియా సర్కార్, నాగ చైతన్య, కల్వకుంట్ల కవిత ట్వీట్స్ చేశారు. అయితే ఈ వీడియోను ఖండించే క్రమంలో చాలా మంది దీన్ని మళ్లీ షేర్ చేస్తుండటంతో అప్పటివరకు విషయం తెలియని వాళ్లకు కూడా ఈ విషయం తెలుస్తోంది. ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా జనాలకు ఇక్కట్లు తప్పేలా లేవు.













