Rashmika Mandanna: మస్కారా కళ్లతో ఇంప్రెస్ చేస్తున్న నేషనల్ క్రష్
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక(Rashmika Mandanna) రీసెంట్ గా థామా(thaama) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు త్వరలోనే ది గర్ల్‌ఫ్రెండ్(the girlfriend) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్యారెక్టర్ ఏదైనా ఆడియన్స్ ను అలరించే రష్మిక అటు సినిమాలతోనే కాకుండా ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటుంది. తాజాగా రష్మిక తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో రష్మిక బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ లో కళ్లకు మస్కారా వేసుకుంటున్నట్టు సెల్ఫీ ఫోటోలతో పాటూ చుడిదార్ లో కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్ గా కనిపించింది. రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.







