Rashmika Mandanna: పర్‌ఫ్యూమ్ బిజినెస్ లోకి రష్మిక

యానిమల్(Animal), ఛావా(Chhava), కుబేర(Kuberaa)తో వరుస సక్సెస్‌లను అందుకున్న రష్మిక ప్రస్తుతం తన స్టార్‌డమ్ ను చాలా తెలివిగా వాడుకుంటుంది. అందులో భాగంగానే వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా పట్టుకుని వాటితో పాటూ పలు బ్రాండ్లకు ఎండార్స్‌మెంట్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.
రష్మిక కేవలం రెండు చేతులా సంపాదించడం మాత్రమే కాదు, ఆ సంపాదనను చాలా తెలివిగా పెట్టుబడి పెడుతుంది. అందులో భాగంగానే రష్మిక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓ కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసింది. రీసెంట్ గా తానో కొత్త బిజినెస్ పెడుతున్నానని, తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో పాటూ ఓ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేసిన రష్మిక ఇప్పుడా బిజినెస్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
అందులో భాగంగానే రష్మిక ఓ పర్‌ఫ్యూమ్ బ్రాండ్ ను లాంచ్ చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. డియర్ డైరీ(Dear Dairy) పేరుతో రష్మిక ఓ కొత్త పర్‌ఫ్యూమ్ ను లాంచ్ చేసింది. దాన్ని లాంచ్ చేస్తూ ఓ యాడ్ ను పోస్ట్ చేసిన రష్మిక ఇది కేవలం ఒక బ్రాండ్, పర్‌ఫ్యూమ్ మాత్రమే కాదని, డియర్ డైరీ తనలో భాగమని రాసుకొచ్చింది. ఈ బిజినెస్ విషయంలో తనకు అందరి సపోర్ట్ కావాలని రష్మిక ఆ పోస్ట్ ద్వారా కోరగా, రష్మికకు అందరూ కొత్త బిజినెస్ విషయంలో ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.