Rashmika Mandanna: బాలీవుడ్ లో రష్మిక బిజీ బిజీ

హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమా సినిమాకీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఫ్లాపు సినిమాలు కూడా రష్మిక క్రేజ్ ను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి. అసలు విషయానికొస్తే రష్మిక ఇప్పటికే బాలీవుడ్ పలు సినిమాలు చేయగా, వాటిలో యానిమల్(Animal), ఛావా(Chhava) సినిమాలు రష్మికకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి.
ఈ రెండు సినిమాలు మినహా రష్మిక బాలీవుడ్ లో చేసిన సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఆశించలేకపోయాయి. రీసెంట్ గా సల్మాన్ ఖాన్(Salman Khan) తో చేసిన సికందర్(Sikandar) సినిమా అయితే రష్మికకు ఫ్లాపును ఇచ్చింది. అయినప్పటికీ రష్మిక క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు మళ్లీ రష్మిక బాలీవుడ్లో వరుస సినిమాలు చేసేందుకు రష్మిక రెడీ అవుతోంది. దినేష్ విజన్(Dinesh Vijan), లవ్ రంజన్(Luv Ranjan) నిర్మించిన కాక్ టెయిల్(Cocktail) సినిమా సెకండ్ ఫ్రాంచైజ్ కాక్‌టెయిల్2(Cocktail2) సెట్స్ లో రష్మిక త్వరలోనే జాయిన్ కాబోతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
కాక్‌టెయిల్2లో షాహిద్ కపూర్(Shahid Kapoor), కృతి సనన్(Krithi Sanon) తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. 2026లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో పాటూ ఆయుష్మాన్ ఖురానా(Ayushman Khurana) ప్రధాన పాత్రలో ఆదిత్య సర్పోత్దార్(Aditya Sarpodtar) దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న థామా(Thama) అనే భారీ బడ్జెట్ సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది. దీపావళి సందర్భంగా థామా థియేటర్లలోకి రానుంది. ఏదేమైనా రష్మికకు బాలీవుడ్ లో భలే ఆఫర్లొస్తున్నాయని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.