Rashmika Mandanna: వాటిని ఎంజాయ్ చేస్తున్నా
రష్మిక మందన్నా(rashmika mandanna) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన గర్ల్‌ఫ్రెండ్(the girl friend) మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్(rahul ravindran) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న రష్మిక, అందులో భాగంగానే సీనియర్ హీరో జగపతి బాబు(jagapathi babu) హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu nischayammu ra) అనే టాక్ షో లో పాల్గొన్నారు.
తాజాగా ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజవగా అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రష్మిక రాగానే నీకో నిక్ నేమ్ పెట్టానంటూ గాలి పిల్ల అనగానే అయ్యయ్యో అని రష్మిక చాలా క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ(vijay devarakonda)తో ఫ్రెండ్షిప్, విజయ్ సేతుపతి(Vijay sethupathi)కి ఫ్యాన్, దళపతి విజయ్(thalapathy vija) కు ఆల్ టైమ ఫ్యాన్.. అంటూ విజయం, విజయ్ ను మొత్తానికి సొంతం చేసుకున్నావా అనగానే రష్మిక వెంటనే నవ్వేసింది.
ఆ తర్వాత రింగ్స్ గురించి మాట్లాడుతూ, చేతికి పెట్టుకున్న ఆ రింగ్స్ ఏమైనా సెంటిమెంటా అంటే చాలా ఇంపార్టెంట్ రింగ్స్ అని చెప్పింది రష్మిక. వాటిలో ఓ రింగ్ ఫేవరెట్ కూడా అయ్యుంటుంది, దానికో హిస్టరీ ఉందని అనగానే రష్మిక సిగ్గులొలికిఇంది. వెంటనే అక్కడున్న ప్రేక్షకుల నుంచి గోల వినిపించగా, వాళ్ల బాధేంటో కనుక్కోమంటే ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్ అని చెప్పింది రష్మిక. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఏమైనా రష్మిక విజయ్ తో తన ప్రేమను బయటపెట్టిందేమో చూడాలి.







