Rashmika Mandanna: రౌడీ జిమ్ స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తా
నేషనల్ క్రష్ రష్మిక(rashmika) ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమాతో ఇవాళే ప్రేక్షకుల్ని పలకరించింది. దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) హీరోగా నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వం వహించగా, ఈ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా రష్మిక, జగపతి బాబు(Jagapathi babu) హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammura) టాక్ షో లో పాల్గొంది.
జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు హాజరవగా, ఇప్పుడు నేషనల్ క్రష్ పాల్గొంది. తాజాగా రష్మిక ఎపిసోడ్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజవగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగపతి బాబు రష్మిక చేసే అల్లరి పనుల గురించి అడగ్గా, వద్దండి నేనిప్పుడు చెప్తే తర్వాత వాళ్లు ఏసుకుంటారని రష్మిక సరదాగా చెప్పింది.
ఇక ఆఖరిగా ఎవరికి మెసేజ్ చేశారనే ప్రశ్నకు తర్వాత మాట్లాడుకుందామని ఆన్సర్ ఇవ్వగా, నన్నెప్పుడైనా కలవాలనుకుంటే జిమ్ కు రమ్మని రష్మిక చెప్పింది. ఏ జిమ్ కు రావాలో చెప్పట్లేదేంటని జగపతి అనగా, దానికి వెంటనే రష్మిక తాను రౌడీ జిమ్(Rowdy Gym) అని ఒకటి స్టార్ట్ చేస్తానని, అందులో తానే అందరికీ ట్రైనింగ్ ఇస్తానని చెప్పింది. మీ క్రష్ ఎవరిని జగపతి అడిగితే, ఆడియన్స్ వైపు చూస్తూ సైగలు చేసిన రష్మిక మీలో ఎవరైనా విజయ్(Vijay) అని పేరున్న వాళ్లున్నారా అని సరదాగా అంది రష్మిక. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఫుల్ ఎపిసోడ్ ఏ స్థాయిలో ఉంటుందోనని చూడ్డానికి ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.







