అందుకే మేము విడిపోయాం!
కెరీర్ తొలినాళ్లలో కన్నడ హీరో రక్షిత్‌శెట్టితో ప్రేమ వ్యవహారాన్ని నడిపింది అగ్రనాయిక రష్మిక మందన్న. నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. తన విఫల ప్రమే గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది రష్మిక మందన్న. నా తొలి చిత్రం కిరిక్‌పార్టీ టైమ్‌లో రక్షిత్‌శెట్టితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే నా ప్రేమకథకు నిశ్చితార్థంతోనే పుల్‌స్టాప్ పడింది. అంతా సవ్యంగా జరుగుతుందనే విశ్వాసం ఉన్నప్పుడే ఏ బంధాన్నైనా ముందుకు తీసుకెళ్లొచ్చు. అభిప్రాయ భేదాలు తలెత్తిన మధ్యలో వదిలేయడం మంచిది. లేకపోతే భవిష్యత్తులో కష్టాలు వస్తాయి. అయితే బ్రేక్ఆప్ వల్ల ప్రేమపై నా నామ్మకాలేవి మారిపోలేదు. ప్రేమ ఎపట్పికి ఉన్నతమైనదే అని చెప్పింది.













