రష్మిక లవ్ స్టోరీ రివీల్ చేసిందా?
ఆహా ఓటీటీలో చరిత్రలో అన్స్టాపబుల్ షో కు ప్రత్యేక పేజీ ఉంది. ఈ షోను బాలయ్య నడిపిస్తున్న తీరు అలాంటిది. టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటూ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ షోకు వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారంటే ఈ షో క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ షో కు యానిమల్ చిత్ర బృందం వచ్చింది.
యానిమల్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రణ్బీర్తో పాటూ రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి వంగ కూడా ఈ షోకు హాజరయ్యారు. అయితే ఈ షోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడనున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. ప్రోమో చూశాక ఎప్పుడెప్పుడు ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.
దానికి కారణం లేకపోలేదు. షో లో బాలయ్య ఓ గేమ్ ఆడిస్తూ, అందులో భాగంగా అర్జున్ రెడ్డి, యానిమల్ హీరోల్లో ఎవరు అందంగా ఉన్నారని రష్మికను అడిగాడు బాలయ్య. దానికి రష్మిక ఏం చెప్పిందన్నది ట్రైలర్ లో రివీల్ చేయలేదు. ఆ తర్వాత షో లోనే విజయ్ దేవరకొండకు కాల్ చేయించడం, ఫోన్ లిఫ్ట్ చేశాక విజయ్ మాట్లాడిన విధానం, దానికి రష్మిక మురిసిపోవడం చూస్తుంటే వీరి మధ్య ఉన్న బంధాన్ని గురించి సీక్రెట్స్ ను బయటపెట్టారనే అనిపిస్తుంది. గత కొంతకాలంగా విజయ్, రష్మిక డేటింగ్ లో ఉన్నారని వార్తలొస్తున్నప్పటికీ వారేమీ ఈ విషయంలో స్పందించలేదు. మరి అన్స్టాపబుల్లో ఏమైనా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇచ్చారేమో చూడాలి.













