మ్యాన్ ఆఫ్ మాసెస్తో నేషనల్ క్రష్
ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా బాలీవుడ్ లో చేస్తున్న వార్2 సినిమాలో ఎన్టీఆర్ సరసన ఓ బాలీవుడ్ భామ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక నటించే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక అయితే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందనే ఆలోచనతో ప్రశాంత్ నీల్ రష్మిక పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తున్న రష్మిక మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా చేస్తుంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కూడా ఓకే చేస్తే రష్మిక కెరీర్ ఎక్కడికో వెళ్లడం ఖాయం. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వీరి కాంబోలో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త విని వారెంతో సంతోషిస్తున్నారు.













