విజయ్ కోసమైనా రష్మిక ఒప్పుకుంటుందా?
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, ఆ తర్వాతి సినిమాను రాహుల్ సాంకృత్స్యన్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రష్మికను తీసుకోవాలని డైరెక్టర్ రష్మికకు కథ చెప్పగా ఆమె రిజెక్ట్ చేసినట్లు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తన పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే రష్మిక ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆ క్యారెక్టర్ కు రష్మిక అయితేనే న్యాయం చేయలగలదని రాహుల్ పట్టుబట్టడంతో విజయ్ రష్మికతో మాట్లాడి ఒప్పించినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో కొన్ని రకాల మార్పులు చేయించేలా చూస్తానని హీరో ప్రామిస్ చేయడంతో పాటూ, విజయ్ తో తనకున్న ఫ్రెండ్షిప్ వల్ల రష్మిక కన్విన్స్ అయినట్లు తెలుస్తోంది.
త్వరలోనే రష్మిక ఈ సినిమాకు అడ్వాన్స్ కూడా తీసుకోబోతుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంతన్నది బయటకు రావల్సి ఉంది. ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది. పుష్ప2 తర్వాత అమ్మడి క్రేజ్ మరింత పెరగడం ఖాయం. అవన్నీ దృష్టిలో ఉంచుకునే కొత్త ప్రాజెక్టుల విషయంలో రష్మిక ఆచితూచి అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ సినిమా విషయంలో రష్మిక ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.













