రెండేళ్ల పాటూ బిజీగా ఉన్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మికతో ఎవరైనా సినిమా లాక్ చేసుకోవాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే అన్నట్లుంది పరిస్థితి. అవును. రష్మిక డేట్స్ అంత సులభంగా దొరికేలా లేవు. పుష్ప సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మిక, యానిమల్ సినిమాతో తన క్రేజ్ ను మరెక్కడికో తీసుకెళ్లింది. రణ్బీర్ లాంటి నటుడి పక్కన ఎక్కడా తొణక్కుండా నటించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం రష్మిక లైనప్ చూస్తుంటే ఇప్పట్లో అమ్మడి డేట్స్ దొరకడం కష్టమేనన్నట్లుంది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న రష్మిక మరోవైపు గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇది కాకుండా సల్మాన్ హీరోగా వస్తోన్న సికిందర్ జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మురుగదాస్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ధనుష్ జోడీగా కుబేరలో నటిస్తున్న రష్మిక, విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న చావా అనే పీరియాడిక్ ఫిల్మ్ లోనూ నటిస్తోంది. ఇది కాకుండా రెయిన్ బో అనే సినిమాను కూడా మొదలుపెట్టింది రష్మిక. కానీ ఎందుకో ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎక్కువగా రావడం లేదు. శివకార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో రష్మికనే హీరోయిన్ అని టాక్ వినిపిస్తోంది. ఇది కాకుండా జూ.ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో కూడా రష్మిక పేరునే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరిన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ అవి ఒప్పుకోవడానికి రష్మక దగ్గర టైమ్ లేదు.













