బాలీవుడ్ లో రష్మిక హారర్ ప్రయోగం
ప్రస్తుతం సినీ పరిశ్రమలో హారర్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అందుకే రూ.30 కోట్లతో తీసిన ముంజ్యా వంద కోట్లకు పైగా రాబట్టింది. అసలు ఏమాత్రం స్టార్ క్యాస్టింగ్ లేని స్త్రీ2 అయితే ఏకంగా రూ.500 కోట్ల క్లబ్ వైపు అడుగులేస్తుంది. కామెడీ లేకపోయినా అజయ్ దేవ్గన్ సైతాన్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి మరిన్ని హారర్ సినిమాలు రానున్నాయి
వాటిలో ఒక సినిమాలో రష్మిక నటించనుండటం విశేషంగా చెప్పాలి. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాకు ఆదిత్య సర్పోద్తర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా వాంపైర్స్ ఆఫ్ విజయనగర అనే టైటల్ తో రూపొందనుంది. కర్ణాటకలో ఫేమస్ ప్లేస్ అయిన హంపి బ్యాక్ డ్రాప్ లో ఎవరూ టచ్ చేయని సరికొత్త కథలను ఈ సినిమా ద్వారా చెప్పనున్నారట.
హీరోగా రాజ్ కుమార్ రావు నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రష్మిక పాత్రకు ఎన్నో వేరియేషన్స్ ఉంటాయని, విజయ నగర సామ్రాజ్య చరిత్రలో మొదలుపెట్టి ఇప్పటివరకు విభిన్న కాలమానాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాతో బాలీవుడ్ లో రష్మిక జెండా పాతాలని చూస్తుంది. అందుకే అమ్మడికి సౌత్ లో ఎంత డిమాండ్ ఉన్నా బాలీవుడ్ అవకాశాలను మాత్రం వదులుకోవడం లేదు.













