మరో డిఫరెంట్ కథకు రష్మిక గ్రీన్ సిగ్నల్
రష్మిక కెరీర్ ఎక్కడా బ్రేకుల్లేకుండా పరిగెడుతుంది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ బిజీ హీరోయిన్ ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. తాజాగా రష్మిక మరో కొత్త సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానీ హీరోగా చేస్తున్న ఓ హార్రర్ థ్రిల్లర్ లో ఆయనకు జోడీగా రష్మికను లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమలో రష్మిక క్యారెక్టర్ ఎంతో కీలకమని తెలుస్తోంది. వాంపైర్ ఆఫ్ విజయనగర అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. రక్త పిశాచులు చుట్టూ తిరిగే ఈ సినిమా కథ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
రక్త పిశాచుల లోకంలోకి అనుకోకుండా వెళ్తే అక్కడ మానవాళికి ఎలాంటి ప్రమాదముంటుందనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ కథపై ఎంతో రీసెర్చ్ చేసి, కొన్ని రకాల నవలల ఆధారంగా విశ్లేషించి సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖరికల్లా కథ పూర్తవుతుంది. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.













