Rashmika Mandanna: మరోసారి వివాదంలోకి రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. పుష్ప(Pushpa), యానిమల్(animal), ఛావా(Chhava) సినిమాలతో సూపర్ సక్సెస్ ను అందుకున్న రష్మిక రీసెంట్ గా శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్(Dhanush) తో కలిసి కుబేర(Kubera)తో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్న రష్మిక(Rashmika)కు సొంత భాష నుంచి మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.
తన మాటలతో కన్నడ ప్రజలను కోపానికి గురి చేస్తున్న రష్మిక ఇప్పుడు మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రష్మిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొడవ సమాజం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ఏకైక వ్యక్తిని తానే అని చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక మాటలపై కన్నడ ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఆల్రెడీ కొడవ కమ్యూనిటీ నుంచి ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు అందుకున్నారు.
కొడవ సామాజిక వర్గం నుంచి ఎవరూ ఇండస్ట్రీలోకి రాలేదని, తాను ఆడిషన్స్ ఇస్తున్న సంగతి కూడా తన ఇంట్లో చెప్పలేదని, సినిమాల్లోకి వెళ్తానని కూడా తాను ముందే ఇంట్లో చెప్పలేదని రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారి అందరూ ఆమెను ట్రోల్ చేసేలా చేస్తున్నాయి. రష్మిక కంటే ఎంతో ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ ప్రేమ(prema) కూడా కొడవ సమాజానికి చెందిన ఆమే. ప్రేమ మాత్రమే కాదు ఎంతోమంది ఆ సమాజం నుంచి వచ్చి నటీనటులుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.