రెమ్యూనరేషన్పై రష్మిక ఫన్నీ కామెంట్
క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అందులోనూ ఏదైనా హిట్ సినిమా వస్తే వెంటనే వారి రెమ్యూనరేషన్స్ పెరిగినట్లు వార్తలొస్తుంటాయి. అందులో కొన్ని నిజాలుండగా మరికొన్ని కేవలం వార్తలుగానే మిగిలిపోతాయి.
ఇక అసలు విషయంలోకి వస్తే, నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవలే యానిమల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యానిమల్ హిట్ అవడంతో రష్మిక రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచిందని, దీంతో ఆమె పారితోషికం రూ.4 కోట్లు దాటిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై రష్మిక తాజాగా స్పందించింది. తన రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తను ఇకనైనా సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. “ఈ విషయాన్ని కన్సిడర్ చేసి, నిర్మాతలను ఎక్కువ పారితోషికం అడగాలనుకుంటున్నా. ఎందుకు రెమ్యూనరేషన్ పెంచారని వాళ్లు అడిగితే మీడియా అలానే చెప్పింది కాబట్టి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నట్లు చెప్తా” అని స్మైల్ ఎమోజీలతో కామెంట్ చేసింది రష్మిక. దీంతో రష్మిక చేసిన ఆ కామెంట్ నెట్టింట వైరల్ అవుతుంది.













