Rashmika: రెమ్యూనరేషన్ తగ్గినా రష్మికను ఆపలేరు

వరుస సినిమాలతో కెరీర్లో దూసుకెళ్తోంది రష్మిక మందన్నా(Rashmika Mandanna). సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రష్మిక క్రేజ్ రోజురోజుకీ విపరీతంగా పెరుగుతుంది. కేవలం సినిమాలతోనే కాకుండా మరిన్ని విషయాల వల్ల వార్తల్లో నిలుస్తోంది రష్మిక. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
పుష్ప2(pushpa2) సినిమాకు రష్మిక ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలకు రష్మిక రెమ్యూనరేషన్ బాగా తగ్గింది. పుష్ప2 తర్వాత రష్మిక ఛావా(chhava), సికందర్(sikander), కుబేర(Kubera) సినిమాలు చేయగా, వాటిలో ఛావాకు రూ.4 కోట్లు, సికందర్ కు రూ.5 కోట్లు, కుబేరకు రూ.4 కోట్లు మాత్రమే తీసుకుందట. పుష్ప2 తో పోలిస్తే రష్మిక ఈ సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.50 % తక్కువ.
అయితే రష్మిక రెమ్యూనరేషన్ తగ్గిందని ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో పాత్రలేమీ తగ్గడం లేదు. వరుస సినిమాలతో రష్మిక దూసుకెళ్తంది. ప్రస్తుతం రష్మిక థామా(Thama), ది గర్ల్‌ఫ్రెండ్(The girlfriend) సినిమాలు చేస్తోంది. రెమ్యూనరేషన్ తగ్గినప్పటికీ రష్మికకు కెరీర్లో బెస్ట్ రోల్స్ రావడం మాత్రం ఆగలేదు. దీన్ని బట్టి రెమ్యూనరేషన్ అనేది రష్మికకు పెద్ద సమస్యే కాదని తెలుస్తోంది.