విజయ్ ది బెస్ట్ అంటున్న రష్మిక
రీసెంట్గా రిలీజైన రణ్బీర్ కపూర్ యానిమల్ టీజర్ ను చూసి సూపర్బ్ అంటూ కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ. విషింగ్ మై డార్లింగ్స్ సందీప్, రష్మిక అండ్ మై ఫేవరెట్ ఆర్కె హ్యాపీ బర్త్ డే అని ట్వీట్ చేశాడు. విజయ్ చేసిన ట్వీట్ కు రష్మిక స్పందిస్తూ థాంక్యూ విజయ్, యు ఆర్ ది బెస్ట్ అంటూ రిప్లై ఇచ్చింది.
గీత గోవిందం సినిమాతో విజయ్, రష్మికల మధ్య బంధం ఏర్పడింది. అప్పటినుంచి వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. ఆ తర్వాత వారిద్దరి కలయికలో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది కానీ ఆ సినమా ఫ్లాప్ అయింది. డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించకపోయినా ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.
విజయ్ ఎక్కడుంటే రష్మిక అక్కడ ఉండటం, ఇద్దరూ కలిసి వెకేషన్కు ఒకే ప్లేస్ కు వెళ్లడం లాంటివి చాలా జరిగాయి. దీంతో వీరి మధ్య స్నేహం కాకుండా మరేదో ఉందని వార్తలొస్తున్నా వాటి గురించి రష్మిక కానీ, విజయ్ కానీ క్లారిటీ ఇవ్వకుండా విననట్లే వదిలేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పరశురామ్ పెట్లతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న విజయ్, ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోగా, ఇప్పుడు ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. అయితే ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేసిన రష్మిక విజయ్ ను మాత్రమే బెస్ట్ అని ఎందుకందో అని ఇప్పుడు నెటిజన్లు తెగ ఆరాలు తీస్తున్నారు.













