Rashmika: హిట్ అందుకుని లక్కీ ఛార్మ్ గా మారిన రష్మిక

కుబేర(kubera) సినిమా హిట్ తో నేషనల్ క్రష్ రష్మిక(rashmika) మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. రష్మిక నుంచి ఆఖరిగా వచ్చిన సికందర్(Sikander) సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో రష్మిక కాస్త డల్ అయింది. కానీ ఇప్పుడు మళ్లీ కుబేర సినిమాతో రష్మిక తిరిగి ఫామ్ లోకి వచ్చింది. యానిమల్(animal), పుష్ప2(Pushpa2), ఛావా(chhaava) హిట్స్ తర్వాత కుబేర మూవీ రష్మిక కు మంచి విజయాన్నిచ్చింది.
అయితే కుబేరలో ధనుష్(dhanush), నాగార్జున(nagarjuna) పాత్రలకు వచ్చినంత సూపర్ రెస్పాన్స్ రష్మిక క్యారెక్టర్ కు రాకపోయినా, కుబేరలో సమీరా(sameera) అనే క్యారెక్టర్ లో రష్మిక ఎంతో మంచి నటనను కనబరిచిందని, ఆ పాత్రలో రష్మిక యాక్టింగ్ ఎంతో సెటిల్డ్ గా ఉందని అందరూ అనుకున్నారు. మరీ ముఖ్యంలో డంప్ యార్డ్ సీన్ లో రష్మిక యాక్టింగ్ ఎంతో నేచురల్ గా ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి కుబేర హిట్ తర్వాత రష్మిక పాన్ ఇండియా సినిమాలకు లక్కీ ఛార్మ్ గా తన ఇమేజ్ ను మరోసారి నిలబెట్టుకుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. గతంలో రష్మిక నుంచి వచ్చిన రెండు తమిళ సినిమాలు ఓ మోస్తరు కలెక్షన్లనే రాబట్టుకోగా, కుబేర కు కూడా తమిళంలో ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. కానీ కుబేర సక్సెస్ రష్మికకు తమిళంలో కొత్త మార్కెట్ ను తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా రష్మిక ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.