Rashmika: ఆయన వల్లే ఆ పాత్ర అంతా బాగా చేయగలిగా

నేషనల్ క్రష్ నటించిన తాజా సినిమా కుబేర(kubera). శుక్రవారం రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ధనుష్(dhanush), నాగార్జున(nagarjuna) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రష్మిక(rashmika) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సమీరా(Sameera) అనే పాత్రలో రష్మిక ఎంతో ఒదిగిపోయి నటించగా, ఆమె పాత్రకు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా కుబేర సక్సెస్ విషయంలో రష్మిక తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది.
కుబేర సినిమాలో తన క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని, దానికి కారణం శేఖర్ కమ్ములే(sekhar kammula) అని ఆయన వల్లే ఆ పాత్ర అంత బాగా వచ్చిందని, కేవలం తాను ఆయన చెప్పింది చెప్పినట్టు మాత్రమే చేశానని తెలిపింది. శేఖర్ కమ్ములకు సినిమా ఉడండే ప్యాషన్ ను చూసి ఆయనతో వర్క్ చేయాలని ఎంతో కాలంగా అనుకుంటున్నానని, కుబేర రూపంలో ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పింది.
ధనుష్(dhanush) లాంటి గొప్ప యాక్టర్లతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మనం వారి పక్కన కనిపించాలంటే తప్పకుండా ది బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుందని, ధనుష్ లాంటి గొప్ప నటుడు మన ముందుంటే మనం కూడా అంతే గొప్పగా నటించాల్సి వస్తుందని, అది తప్ప మనకు వేరే ఛాయిస్ ఉండదని చెప్పింది. ఇక నాగార్జున(nagarjuna) గురించి మాట్లాడుతూ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనని, నాగార్జునను తానెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటానని, కుబేర టీమ్ ది బెస్ట్ అంటూ రాసిన రష్మిక ఆ పోస్ట్ లో కుబేర వర్కింగ్ స్టిల్స్ ను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.