శివరంజని ట్రైలర్ విడుదల
ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్‌తో వస్తోన్న చిత్రమే శివరంజని. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ను సెన్షేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ ట్రైలర్ చాలా బావుంది. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. ఇలాంటి నిర్మాతలకు మంచి విజయాలు వస్తే ఇలాంటి కన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఇంకా ఎక్కువగా షైన్ అవుతాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలకు మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.













