బంపరాఫర్ కొట్టేసిన రష్మిక
ఈ సంక్రాంతి కానుకగా మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో విజయ్. తమిళనాడు మినహా దేశవ్యాప్తంగా 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ అయినప్పటికీ మాస్టర్ 250 కోట్లకు పైగా వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రిలీజ్ అయిన పదహారు రోజుల నుంచి మాస్టర్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే విజయ్ తన తర్వాతి సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో చేయనున్నాడు. విజయ్ కెరీర్ లో 65వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఏప్రిల్ నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. గత కొంతకాలంగా ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే, రష్మిక పేర్లు వినిపించాయి.
కానీ ఇప్పుడు మేకర్స్ పూజా ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇదే సినిమాలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తుంది. అనుకున్నట్లుగానే ఆ క్యారెక్టర్ కోసం రష్మికను ఓకే చేయనున్నారట మేకర్స్. విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే వరుస సినిమాలతో టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్న రష్మిక కు ఇది బంపరాఫర్ లెక్కే వస్తుంది. మరి ఈ విషయమై మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే తప్ప ఏ విషయం తెలీదు.













