నా పేరు రష్మి…రేష్మి కాదు
రష్మి గౌతమ్ తాజాగా అంతకు మించి అనే చిత్రంలో కథానాయికగా చేస్తోంది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆ సినిమా విడుదల కోసం అసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, మీరు రేష్మి అని పత్రికల్లో వస్తుంది అని అడిగితే వెంటనే కోపంగా ఉన్న ఎమోజీ పోస్టు చేసింది. తర్వాత నా పేరు రష్మి గౌతమ్.. రేష్మి గౌతమ్ కాదు. ఈ వివరణ తర్వాత అయిన మీడియా నా పేరు సరిగ్గా ప్రచురించాలి అని పేర్కొంది.













