బహుముఖ ప్రజ్ఞా శాలి రాశీ ఖన్నా
పంజాబీ భామ రాశిఖన్నా నటి, సింగరే కాదు ఇప్పుడు వయోలిన్ ప్లేయర్ కూడా అయ్యింది . బాలీవుడ్లో మద్రాస్ కేఫ్ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయింది. అక్కినేని ఫ్యామిలీ చిత్రం మనంలో కామియో పాత్రలో నటించిన ఈమె శ్రీనివాస్ అవసరాలతో కలిసి నాగశౌర్య సరసన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ జోరు, గోపీచంద్ జిల్., ఆక్సిజన్ చిత్రాలతో జోరు చూపించి, తన అందాలతో ప్రేక్షకులకు జిల్ మనిపించింది. రామ్ శివం, రవితేజ బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు, సాయితేజ్ సుప్రీం, ప్రతి రోజు పండుగే, రామ్ హైపర్, జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ, మలయాళంలో విలన్, వరుణ్ తేజ్ తొలిప్రేమ, నితిన్ శ్రీనివాస కళ్యాణం, నాగచైతన్య వెంకీ మామ, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలలో నటించింది. వీటిల్లో ఊహలు గుసగుసలాడే. జిల్, సుప్రీం, జైలవకుశ, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతిరోజు పండుగే వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక ఈమె తెలుగులో తాను పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించిన రెండో చిత్రం జోరు, బాలకృష్ణుడు, జవాన్, ప్రతిరోజు పండుగే చిత్రాలలో పాటలు కూడా పాడింది. మలయాళ చిత్రం విలన్ కి సైతం ప్రమోషనల్ సాంగ్ పాడటం విశేషం.
ఇలా ఈమె తనలోని బహుహుఖ ప్రజ్ఙను చాటుకుంది. ప్రస్తుతం కరోనాకారణంగా దాదాపు రెండు నెలలకు పైగా అందరు సెలబ్రిటీస్ లా రాశిఖన్నా కూడా ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉంది. ఈ సమయంలో ఈ చిన్నది సరికొత్త కళలను నేర్చుకోవడంపై దృష్టి సారించింది. తనలోని సంగీతాభిలాషకు మరింత పదును పెడుతూ, సంగీతాన్ని అవపోసన పడుతోంది. గిటార్ నేర్చుకోవడంలో తలమునకలైపోయింది. తాజాగా ఈమె తన సంగీతానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గిటార్ ని వాయిస్తూ, గెట్ యూ ది మూన్ అనే పాటను ఆలపించి, అలరించింది. గిటార్ ని నెమ్మదిగా వాయిస్తూ, తనకు ఎంతో ఇష్టమైన పాత్రను ఎంతో హృద్యంగా, స్మూత్‌గా తెరచాటున రాశిఖన్నా పాడిన ఆ పాట పరవశింపజేసేలా ఉంది. మీరు ఈ ప్రయత్నాన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను… అంటూ ఆ పాట వీడియోను షేర్ చేసింది. రాశి గొంతు నుంచి జాలువారిన ఓ ఓదార్పు సంగీతం అందరి హృదయాలన తాకేలా ఒక కెరటంలా సాగిపోయిందనే చెప్పాలి.













